
పవన్ కళ్యాణ్, జయంత్ పరాన్జీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి ‘ఖుషీగా...’అనే టైటిల్ అనుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి ‘లవ్ లీ’ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ టైటిల్ ని ఇటీవల ఫిలిం ఛాంబర్ లో సంస్థ రిజిస్ట్రేషన్ చేసారు కూడా. పవన్ కళ్యాణ్ కూడా ఈ టైటిల్ వైపే మ్రెగ్గు చూపుతున్నట్లు చెప్తున్నారు. ‘ఖుషీగా...’ అనే టైటిల్ పెట్టడంతో గతంతో తనే హీరోగా చేసిన ‘ఖుషీ’ చిత్రం అని పొరబడే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం హిందీ హిట్. ‘లవ్ ఆజ్ కల్’ హిందీ చిత్రం ఆధారంగా కొద్దిపాటి మార్పు చేర్పులతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇంతకుముందే కాశీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి ఈ నెల 14 నుంచి 40రోజులపాటు న్యూజిలాండ్ లో ఓ భారీ షెడ్యూల్ జరపనున్నారు. ఈ చిత్రానికి మాటలు: త్రివిక్రమ్, సంగీతం: మణిశర్మ. పవన్ కళ్యాణ్ సరసన త్రిష, కృతికర్బందా హీరోహీరోయిన్లుగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో నటుడు గణేష్ బాబు నిర్మిస్తారు. ఇక ఈ రెండు టైటిల్స్ లో ఏది చిత్రానికి ఫైనల్ చేస్తారో తెలియాల్సి ఉంది. ఇంతకీ ఏ టైటిల్ అయితే బాగుంటుందంటారు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.