
హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ అన్న పేరుకే అభిమానులు పులకరించిపోయే ఆదరణ సంపాదించిన హీరో పవర్ స్టార్. "పవన్ కళ్యాణ్ లవ్ లీ" షూటింగ్ కోసం కొద్ది రోజుల క్రితం కాశీలో మకాం వేసిన సంగతి తెలిసిందే. ఇలా పవన్ వారణాసి చేరుకున్నాడన్న విషయం తెలిసిన మొదటి క్షణం నుండే అక్కడున్న అభిమానులు ఆయనను చూడడానికి తండోపతండాలుగా రావడం మొదలెట్టారంట. మొదటి రెండు మూడు రోజులు కొద్దిమందిని కలవడానికి ఇష్టపడ్డ పవన్ ఒక్కసారి పనిలో నిమగ్నమైయ్యాక..బాగా బిజీ అయిపోవడంతో అభిమానులకు దూరంగా ఉంటూ వచ్చాడు. కానీ ఉత్సాహం ఆపుకోలేని పవర్ అభిమానులు ఏకంగా షూటింగ్ స్పాట్ కే వచ్చేసి అభిమానం చూపడంతో కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అయినా అందరినీ సంతృప్తి పరచడంతో అభిమానులు తెగ ఆనందపడిపోయారట. ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రంలో ఇంత ఆదరణ లభించడం ‘మెగా’కుటుంబానికే చెల్లింది.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.